Thursday 29th January 2026
12:07:03 PM
Home > తాజా > కేబీకే గ్రూప్ ఖాతాలో మరో అవార్డు!

కేబీకే గ్రూప్ ఖాతాలో మరో అవార్డు!

kbk group
  • టైమ్స్ బిజినెస్ అవార్డు అందుకున్న చైర్మన్ భరత్ కుమార్
  • డిజిటల్ మార్కెటింగ్ సేవలకు గుర్తింపుగా పురస్కారం

KBG Group Receives Times Business Award | తెలంగాణలో వివిధ కంపెనీలతో విభిన్న రంగాల్లో సేవలు అందిస్తున్న కేబీకే గ్రూప్ ఖాతాలో మరో అవార్డు చేరింది. వివిధ వ్యాపార రంగాలలో అత్యుత్తమ సేవలు, ఆవిష్కరణలను గుర్తించి ప్రముఖ జాతీయ మీడియా టైమ్స్ గ్రూప్ ఏటా టైమ్స్ బిజినెస్ అవార్డ్స్ ను ప్రదానం చేస్తుంది.

అందులో భాగంగా కేబీకే గ్రూప్ నుంచి కేబీకే బిజినెస్ సోల్యూషన్స్ ఫాస్ట్ గ్రోయింగ్ మార్క్ టెక్ కంపెనీగా గుర్తింపు పొందింది. కేబీకే గ్రూప్ లో భాగమైన కేబీకే బిజినెస్ సోల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఐటీ, డిజిటల్ మార్కెటింగ్ సేవలు అందిస్తోంది. ప్రస్తుత టెక్నాలజీకి అనుగుణంగా డిజిటల్ మార్కెటింగ్ లో సరికొత్త మెళకువలతో క్లయింట్లకు సంతృప్తికరమైన సర్వీసులు అందిస్తోంది.

ఈ సేవలకు గుర్తింపుగా 2024‌-25 ఏడాదికి గానూ టైమ్స్ బిజినెస్ అవార్డుకు ఎంపికయ్యింది. ఈ మేరకు కేబీకే గ్రూప్ చైర్మన్ డా. క్కక్కిరేణి భరత్ కుమార్ సోమవారం గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ టైమ్స్ బిజినెస్ అవార్డు అందుకున్నారు.

ఈ సందర్భంగా డా. భరత్ కుమార్ మాట్లాడుతూ టైమ్స్ గ్రూప్ నుంచి ఈ అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ టైమ్స్ బిజినెస్ అవార్డుతో తమపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. డిజిటల్ మార్కెటింగ్ విభాగంలో కేబీకే బిజినెస్ సొల్యూషన్స్ అడ్వాన్స్ టెక్నాలజీతో సేవలు అందిస్తున్నట్లు వెల్లడించారు.

You may also like
note books distribution
KBK Group-Lions Club ఆధ్వర్యంలో నోట్ బుక్స్ పంపిణీ!
Kakkireni Bharath Kumar
యూనిప్రో సీఈవోగా కేబీకే గ్రూప్ చైర్మన్ డా. భరత్ కుమార్!
uk education fair
యూకేలో చదవాలనుకుంటున్నారా.. అయితే మీకో బంపర్ ఆఫర్!
ఆంత్రప్రెన్యూర్ షిప్ కేవలం బిజినెస్ కాదు

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions