Kavitha Seeks Renaming Of Andaman And Nicobar As ‘Azad Hind’ | అండమాన్ నికోబర్ దీవులకు ఆజాద్ హింద్ పేరు పెట్టాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా శుక్రవారం తెలంగాణ జాగృతి ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నేతాజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు కవిత. ఈ సందర్భంగా మాట్లాడుతూ..అండమాన్ దీవుల పేరును ఆజాద్ హింద్ గా మార్చాలని డిమాండ్ చేస్తూ ప్రధానికి లేఖ రాసినట్లు వెల్లడించారు.
అండమాన్ దీవులకు బ్రిటీష్ పాలకులు పేర్లు పెట్టారని గుర్తుచేసిన కవిత వలసవాద గుర్తులను తొలగించే విధంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ గౌరవార్థం ఆ దీవులకు ఆజాద్ హింద్ అని నామకరణం చేయాలన్నారు. ఇది కేవలం పేరు మార్పు మాత్రమే కాదని, దేశం కోసం ప్రాణాలు అర్పించిన యోధులకు ఇచ్చే అసలైన గౌరవం అని అన్నారు. ఇది రాజకీయం ఏమాత్రం కాదని తెలిపారు. నేతాజీ దేశం గర్వించదగ్గ మన సంపదన్నారు.









