Sunday 8th September 2024
12:07:03 PM
Home > తాజా > లిక్కర్ కేస్ తర్వాత మళ్ళీ కవిత యాక్టీవ్…!

లిక్కర్ కేస్ తర్వాత మళ్ళీ కవిత యాక్టీవ్…!

Kavitha active again after liquor case

ఢిల్లీ లిక్కర్ స్కాం (Delhi liquor scam) ఆరోపణల్లో ఆప్ నేతలతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, బీఆరెఎస్ ఎమ్మెల్సీ కవిత (kalvakuntla kavitha)పేరు కూడా వచ్చింది. తర్వాత కొద్దీ రోజుల పాటు బీజేపీ, బీఆరెఎస్ మధ్య లిక్కర్ కేస్ గురుంచి మాటల యుద్ధం జరిగింది.

అతి త్వరలో కవిత జైల్ కు వెళ్లనుందని బీజేపీ నేతలు తరచూ వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచారు. కానీ గత కొద్ది రోజులుగా లిక్కర్ కేస్ స్తబ్దుగా ఉంది. అలాగే బీజేపీ వాళ్ళు కూడా కవిత అరెస్ట్ అంశం పెద్దగా ప్రస్తావించడం లేదు.

లిక్కర్ కేస్ అంశం తెర పైకి వచ్చినప్పటి నుండి కవిత రాజకీయ వ్యాఖ్యలకు,రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.

కానీ ఇప్పుడు కాంగ్రెస్ నేత టీ-పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి (revanth reddy) చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా బీఆరెఎస్ నిరసనలకు పిలునిచ్చింది. ఈ నిరసనలో భాగంగా ఎమ్మెల్సీ కవిత మళ్ళీ రాజకీయంగా తెరపైకి వచ్చారు.

kavitha fires on revanth reddy

రైతు పొలాలకు సరిపడా విద్యుత్‌ అందుబాటులో ఉన్నప్పుడే రైతులు సంతోషంగా జీవించగలరని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఉచిత విద్యుత్‌పై తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆమె ఖండించారు.

రేవంత్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిన్న, నేడు బీఆరెఎస్ నిరసనలకు పిలుపునిచ్చింది.అందులో భాగంగా బీఆరెఎస్ ఎమ్మెల్సీ కవిత బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో నగరంలోని పవర్‌ స్టేషన్‌ వద్ద ధర్నా నిర్వహించారు.

Read also: ఏపీ సీఎం జగన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ వార్నింగ్!

ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్పొరేటర్లు పాల్గొని రేవంత్ రెడ్డిపై, కాంగ్రెస్ పార్టీపై తమ వ్యతిరేకతను చాటుకున్నారు. అనంతరం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రైతులకు నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్నారని, కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని అందిస్తున్నారని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న రైతుబంధు పథకం దేశంలో మరెక్కడా లేదని ఆమె పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను చూస్తే కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక పార్టీ అని స్పష్టం అవుతుందని ఆమె అభిప్రాయపడ్డారు.

‘‘60 ఏళ్లుగా దేశంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తమ హయాంలో రైతులను ఇబ్బందులకు గురి చేసిందని.. రైతులకు 24 గంటల కరెంటు ఎందుకు ఇవ్వలేకపోయారు” అని కవిత వ్యాఖ్యానించారు.

పరిశ్రమలకు 3 గంటకు విద్యుత్ సరిపోతుందని మాట్లాడే ధైర్యం రేవంత్ రెడ్డికి ఉందా? అని కవిత ధ్వజమెత్తారు. రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పే వరకు కాంగ్రెస్‌ నేతలను గ్రామాల్లో తిరగనివ్వబోమని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.

You may also like
kalvakuntla kavitha arrested
సీబీఐకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖ!
kalvakuntla kavitha arrested
ఎమ్మెల్సీ కవితకు సీబీఐ షాక్.. లిక్కర్ కేసులో మరో కీలక మలుపు!
Kavitha
బాండ్ పేపర్లతో కొత్త డ్రామాలు.. కాంగ్రెస్ నేతలపై కవిత ఫైర్!
revanth reddy
రైతు బంధు నిలిపివేత.. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions