Karur Stampede News | తమిళనాడులోని కరూర్ లో టీవీకే పార్టీ అధ్యక్షుడు నిర్వహించిన ప్రచార సభలో ఘోర విషాదం చోటుచేసుకున్న విషయం తెల్సిందే. ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు 9 మంది చిన్నారులతో సహా 39 మంది మృతిచెందారు. మరో 20 మంది పరిస్థితి విషమంగా ఉంది.
ఈ నేపథ్యంలో విజయ్ స్పందించారు. కరూర్ ర్యాలీలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. అలాగే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ప్రార్ధించారు. ఈ ఘటనతో తన హృదయం ముక్కలైందని, తాను భరించలేని బాధ, దుఃఖం లో ఉన్నట్లు విజయ్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదే సమయంలో మృతుల కుటుంబ సభ్యులకు రూ.20 లక్షల పరిహారం ప్రకటించారు. అలాగే గాయపడిన వారికి రూ.2 లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు. డబ్బులు చెల్లించినంత మాత్రానా బాధిత కుటుంబాల బాధను తీర్చలేమని, కానీ వారికి అండగా ఉండడం తన కర్తవ్యమన్నారు. ఒకపోతే మృతుల కుటుంబాలకు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షలు, గాయపడిన వారికి రూ.లక్ష పరిహారం ప్రకటించింది.









