‘Kantara: Chapter 1’ box office collection’s | రిషబ్ శెట్టి కథానాయకుడిగా వచ్చిన కాంతారా చాప్టర్ 1 బాక్స్ ఆఫీసు వద్ద కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది. దసరా సందర్భంగా విడుదలైన ఈ మూవీ కేవలం 9 రోజుల్లోనే రూ.500 కోట్ల మార్కును అందుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ రూ.509 కోట్లు వసూలు చేసినట్లు నిర్మాణ సంస్థ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
2025 సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన రెండవ చిత్రంగా కాంతారా నిలిచింది. విక్కీ కౌశల్, రష్మిక ప్రధాన పాత్రలో వచ్చిన ‘ఛావా’ మూవీ రూ.600 కోట్లు వసూలు చేసి ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. అయితే ఇప్పటికీ థియేటర్ల వద్ద హౌస్ ఫుల్ గా నడుస్తున్న కాంతారా చాప్టర్ 1 అతి త్వరలోనే ఛావా రికార్డును బ్రేక్ చేసే అవకాశం ఉంది.









