KA Paul News Latest | ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు ఓ యువతి హైదరాబాద్ పంజాగుట్ట పోలీసులకు కేఏ పాల్ పై ఫిర్యాదు చేసింది.
పాల్ ఆఫీసులో పని చేస్తున్న సమయంలో తనను లైంగికంగా వేధించారని ఆమె ఆరోపించింది. దీనికి సంబంధించి పలు ఆధారాలను సైతం ఆమె సమర్పించింది. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.









