Jr. NTR Thanks Chandrababu And Pawan Kalyan | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ( Cm Chandrababu ), ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ( Deputy Cm Pawan Kalyan ) కు ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ( Jr. NTR ) ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
కాగా సెప్టెంబర్ 27న ఎన్టీఆర్, జాన్వీ కపూర్ ( Jhanvi Kapoor ) నటించి, కొరటాల శివ ( Koratala Siva ) దర్శకత్వం వహించిన దేవర ( DEVARA ) రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో స్పెషల్ షో ( Special Show )లకు, టికెట్ ధరల పెంపుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతినిచ్చింది.
సింగిల్ స్క్రీన్ ( Single Screen ) లో అప్పర్ క్లాస్ ( Upper Class ) రూ.110, లోవర్ క్లాస్ ( Lower Class ) రూ.60 మరియు మల్టీప్లెక్స్ ( Multiplex )లో రూ.135 వరకు టికెట్ల రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ( Green Signal ) ఇచ్చింది. ఈ మేరకు జీవో జారీ చేసింది.
అలాగే రిలీజ్ రోజు ఆరు షోలు, ఆ తర్వాత తొమ్మిది రోజుల పాటు ఐదు షోలకు ప్రభుత్వం ఓకే చెప్పింది. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు.
దేవర సినిమ కోసం నూతన జీవో ను జారీ చేసినందుకు మరియు తెలుగు సినిమాకు నిరంతర మద్దతు ఇస్తున్నందుకు సీఎంకు, డిప్యూటీ సీఎంకు ఎన్టీఆర్ ధన్యవాదాలు తెలిపారు. అలాగే సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ( Kandula Durgesh ) కు కూడా కృతజ్ఞతలు చెప్పారు.