Jharkhand Assembly Election Results | మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి.
మధ్యాహ్నం వరకు వెలువడిన ఫలితాలను చూస్తే, మహారాష్ట్రలో అధికార మహాయుతి కూటమి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖరారు అయ్యింది.
మరోవైపు ఝార్ఖండ్ లో అంచనాలకు భిన్నంగా జేఎంఎం, కాంగ్రెస్ ల ఇండీ కూటమి ఆధిక్యంలో కొనసాగుతుంది. మొత్తం 81 సీట్లున్న రాష్ట్రంలో కాంగ్రెస్ కూటమి ఇప్పటికే 52 సీట్లలో ఆధిక్యంలో ఉంది. అలాగే బీజేపీ నేతృత్వ కూటమి 27 సీట్లలో ముందంజ లో ఉంది. ఇతరులు మరో మూడు సీట్లలో లీడింగ్ లో ఉన్నారు.