JEE Mains Exam Students Stuck In Traffic Due to Pawan Kalyan Convoy | డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కారణంగా 30 మంది విద్యార్థులు పరీక్ష రాయలేకపోయారని నిప్పులుచేరిగింది వైసీపీ.
విశాఖ జిల్లా పెందుర్తి లో సోమవారం పవన్ కళ్యాణ్ కాన్వాయ్ వస్తుండడంతో పోలీసులు ట్రాఫిక్ నిలిపివేశారని, దింతో పెందుర్తి అయాన్ డిజిటల్ విద్యార్థులు పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా వెళ్లారని పేర్కొంది.
జేఈఈ పరీక్ష సోమవారం ఉదయం 8 గంటల 30 నిమిషాలకు ఉండగా, పవన్ కళ్యాణ్ కాన్వాయ్ మూలంగా 30 మంది విద్యార్థులు ట్రాఫిక్ లో చిక్కుకుని రెండు నిమిషాలు కేంద్రానికి ఆలస్యంగా చేరుకున్నారని జగన్ పార్టీ వెల్లడించింది.
ఆలస్యం కారణంగా విద్యార్థులను సిబ్బంది లోపలికి అనుమతించలేదని తెలిపింది. ఈ నేపథ్యంలో కష్టపడి చదివి పరీక్షలు రాయకపోతే ఆ విద్యార్థులు ఎంత బాధ పడుతారో తెలుసా పవన్ అంటూ జగన్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది.