Janwada Farm House | ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో బీఆరెస్ నాయకుడు ప్రదీప్ రెడ్డి జన్వాడలోని తన ఫాం హౌజ్ FTL పరిధిలో లేదని జన్వాడ దానిని కూల్చొద్దు అంటూ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ప్రతివాదులుగా రాష్ట్ర ప్రభుత్వం, హైడ్రా కమిషనర్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ తదితరులను చేర్చారు. జన్వాడ వద్ద ఓఆర్ఆర్ సమీపంలో ఉన్న ఫార్మ్ హౌస్ ఉస్మాన్ సాగర్ ఎఫ్ టీ ఎల్ పరిధిలో లేదని పిటిషన్ లో ప్రదీప్ రెడ్డి పేర్కొన్నారు.
2019లో తాను పొలం, ఫార్మ్ హౌస్ ను కొనుగోలు చేసినట్లు ఇది ఎఫ్ టీ ఎల్ పరిధిలో లేదని ఆధారాలు చూపించినా, అధికారులు వినడం లేదని విమర్శించారు.
రాజకీయ కారణాలతో తన ఫార్మ్ హౌస్ కు నష్టం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఇదిలా ఉండగా జన్వాడ ఫార్మహౌస్ కేటీఆర్ దే నని పలువురు కాంగ్రెస్ నాయకులు గతంలో ఆరోపించిన విషయం తెల్సిందే.