Sarpanch Navya | కొద్దీ రోజుల క్రితం స్టేషన్ ఘనపూర్(Station Ghanpur)లో ఎమ్మెల్యే రాజయ్య (Tatikonda Rajaiah) మరియు జానకీపురం సర్పంచ్ నవ్య ల మధ్య పెద్ద మాటల యుద్ధమే జరిగింది.
తనను లైంగికంగా వేధిస్తున్నాడని, బీఆరెస్ పార్టీ పెద్దలకు పిర్యాదు చేసినా ఎవరు పట్టించుకోవడం లేదంటూ సంచలన ఆరోపణలు గుప్పించారు సర్పంచ్ నవ్య.
ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రాజయ్య.. నవ్య ఇంటికి వెళ్లి సంధి కుదుర్చుకున్నారు. అలాగే అభివృద్ధి కోసం గ్రామానికి నిదులు కూడా కేటాయిస్తానని హామీ ఇచ్చారు.
Read Also: Munugoduలో కాంగ్రెస్ పార్టీకి షాక్.. పార్టీకి కీలక నేత రాజీనామా!
అయినప్పటికీ సర్పంచ్ నవ్య (Sarpanch Navya) మరియు ఎమ్మెల్యే రాజయ్యల వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఆఖరికి రాజయ్య కు టికెట్ రాకపోవడానికి కూడా ఇదే ప్రధాన కారణమని కథనాలు వెలువడ్డాయి.
కాగా ఇప్పుడు స్టేషన్ ఘనపూర్ నుండి బీఆరెస్ అభ్యర్థిగా నామినేషన్ ను దాఖలు చేశారు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి.
మరోవైపు సర్పంచ్ నవ్య కూడా ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఆ నియజకవర్గం నుండి నామినేషన్ వేశారు.
రాజకీయంగా ఎదగడం తో పాటు ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశ్యం తోనే నామినేషన్ వేసినట్లు స్పష్టం చేశారు ఆమె.