Jadeja-Samson trade | ఐపీఎల్ 2026 కోసం మినీ ఆక్షన్ డిసెంబర్ నెలలో జరగనుంది. నవంబర్ 15 లోపు ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకున్న ప్లేయర్ల జాబితాను బీసీసీఐ సమర్పించాలి. ఇదే సమయంలో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జడేజా-సంజు శాంసన్ ట్రేడ్ పై సర్వత్రా ఆసక్తిగా మారింది. అయితే ఈ ట్రేడ్ దాదాపు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది.
ట్రేడ్ లో భాగంగా సంజు శాంసన్ చెన్నై కి వెళ్తాడు, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా రాజస్థాన్ కు వెళ్తాడు. జడేజాతో పాటుగా ట్రేడ్ లో భాగంగా ఇంగ్లాండ్ ప్లేయర్ సామ్ కరన్ కూడా రాజస్థాన్ కు వెళ్తాడు. ఈ మేరకు ఇరు ఫ్రాంచైజీల మధ్య తుది దశ చర్చలు నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఫ్రాంచైజీల ట్రేడ్ కు బీసీసీఐ నుంచి ఆమోదం లభించాలి. అతి త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.









