Italy make history by qualifying for 2026 T20 World Cup | యూరోప్ లో ఫుట్బాల్ వంటి ఆటలకు భారీ క్రేజ్ ఉంటుంది. కానీ ఇప్పుడు క్రికెట్ కు కూడా క్రమంగా ఆదరణ పెరుగుతుంది.
2026లో భారత్, శ్రీలంక వేదికగా టీ-20 వరల్డ్ కప్ జరగనున్న విషయం తెల్సిందే. 20 జట్లకు గాను 13 జట్లు నేరుగా క్వాలిఫై అవ్వగా, యూరోప్ క్వాలిఫైర్ ద్వారా ఇటలీ, నెదర్లాండ్స్ అర్హత సాధించాయి. ఐసీసీ మెగా టోర్నీకి ఇటలీ తొలిసారి అర్హత సాధించి చరిత్ర సృష్టించడం విశేషం.
ఇటలీ తో జరిగిన మ్యాచులో నెదర్లాండ్స్ గెలిచి అర్హత సాధించింది. మరోవైపు ఓడిపోయినా నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉండడంతో ఇటలీ కూడా పొట్టి ప్రపంచ కప్ బరిలో నిలిచింది. ఇప్పటికే యూఎస్, కెనడా కూడా టీ 20 వరల్డ్ కప్ కు అర్హత సాధించిన విషయం తెల్సిందే.
మరోవైపు ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ జో బర్న్స్ గతేడాది ఇటలీ దేశ క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా నియమితులయ్యాడు.









