ఆర్సీ 16లో కీలక పాత్ర..?
Dhoni In RC 16 | గేమ్ ఛేంజర్ (Game Changer) తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), ఉప్పెన ఫేం రామ్ బుచ్చిబాబు సాన (Buchibabu Sana) దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. ‘RC 16’ వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.
మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ (Sukumar) రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఏఆర్ రెహ్మన్ సంగీతం అందిస్తున్నారు రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ నటిస్తోంది. ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ (Shiva Raj Kumar) ఓ కీలకమైన కోచ్ పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది.
జగపతిబాబు, మీర్జపూర్ ఫేం దివ్యేందు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అయితే తాజాగా ఈ సినిమాలో భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ధోనీ కూడా కనిపించనున్నారని ఓ వార్త వైరల్ అయ్యింది.
దీంతో ఆర్సీ 16 మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది. అయితే రామ్ చరణ్ సినిమాలో ధోనీ నటించడం లేదని, అదంతా రూమర్ మాత్రమే నని మరో వార్త వెలుగులోకి వచ్చింది.
దీంతో ఫ్యాన్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. ధోనీకి, రామ్ చరణ్ కి మధ్య సాన్నిహిత్యం నేపథ్యంలో సినీ రంగంపై ఆసక్తి ఉన్న ధోని ఆర్సీ 16లో నటించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇప్పటికే ధోనీ ఎంటర్టైన్మెంట్స్ పేరుతో ధోని సినిమాలు నిర్మిస్తున్న విషయం తెలిసిందే.