IPL-2025 Schedule | క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( Indian Premier League )షెడ్యూల్ వచ్చేసింది. ఐపీఎల్ 2025 18వ ఎడిషన్ ( Edition ) కు సంబంధించిన పూర్తిస్థాయి షెడ్యూల్ ఆదివారం సాయంత్రం వెలువడింది.
మార్చి 22 నుంచి మే 25 వరకు ఐపీఎల్ సందడి చేయనుంది. మొత్తం 65 రోజులకు గాను 74 మ్యాచులు జరగనున్నాయి.
తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్కత్త నైట్ రైడర్స్ ( KKR )-బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ( RCB ) మధ్య మార్చి 22న కోల్కత్తలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా తలపడనున్నాయి.
మార్చి 23న సన్ రైజర్స్ హైదరాబాద్ ( SRH )-రాజస్థాన్ రాయల్స్ ( RR ) మధ్య హైదరాబాద్ వేదికగా మ్యాచ్ జరగనుంది.
ఇకపోతే మే 20, మే 21న క్వాలిఫైర్ 1, ఎలిమినేటర్ మ్యాచులు హైదరాబాద్ వేదికగా జరుగుతాయి. మే 23న క్వాలిఫైర్ 2,మే 25 ఫైనల్ మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్ లో జరగనుంది.