Solar Panels On Railway Track | భారతీయ రైల్వే (Indian Railway) మరో వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. రైలు పట్టాల మధ్యలో సోలార్ ప్యానెల్స్ (Solar Pannels) ఏర్పాటు చేసింది.
బనారస్ లోకోమోటివ్ వర్క్స్ వారణాసి రైల్వే ట్రాక్‌ల మధ్య దేశంలో మొట్టమొదటి సారిగా 70 మీటర్ల మేర సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుచేశారు.
ఈ లైన్ల మధ్య 15KWp కెపాసిటీ గల 28 ప్యానెల్‌లు అమర్చారు. గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించడంలో ఇది స్థిరమైన ముందడుగు అని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. ఎక్స్ వేదికగా దీనికి సంబంధించిన ఫొటోలు షేర్ చేసింది.
రైల్ ట్రాన్స్ పోర్టేషన్ లో రంగంలో ఇది పర్యావరణహిత ప్రయత్నంగా భావిస్తున్నారు. దేశమంతటా ఈ పద్ధతి అమలైతే శక్తి వినియోగంలో భారీగా ఆదా సాధ్యమవుతుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.









