Friday 18th October 2024
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జిపై ట్రయల్ రన్ సక్సెస్.. విశేషాలివే!

ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జిపై ట్రయల్ రన్ సక్సెస్.. విశేషాలివే!

chenab bridge

Chenab Bridge | ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన చినాబ్ బ్రడ్జి (Chenab Bridge) నిర్మాణం దాదాపుగా పూర్తయ్యింది. దీంతో ఇటీవలే రైల్వే శాఖ వంతెనపై రైలును ప్రయోగాత్మకంగా నడిపింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఈ ట్రయల్ రన్ విజయవంతమైందని, త్వరలో వంతెనపై రైలు సర్వీసులు ప్రారంభమవుతాయని ఉత్తర రైల్వే విభాగం తెలిపింది. జమ్మూ కశ్మీర్ లోని రాంబన్ జిల్లా సాంగల్దాన్ నుంచి రియాసీ జిల్లాను కలుపుతూ ఈ వంతెనను నిర్మించారు.

ఈ వంతెన కశ్మీర్ ప్రజలకు ప్రజలకు అత్యంత ఉపయోగకరంగా మారనుంది. రైలు మార్గం ద్వారా కశ్మీర్ ను భారత్ లోని మిగతా ప్రాంతాలకు అనుసంధానించేందుకు చేపట్టిన ఉధంపూర్ – శ్రీనగర్ – బారాముల్లా రైల్వే ప్రాజెక్టులో భాగం ఇది.

చీనాబ్ నదీ గర్భం నుంచి 359 మీటర్ల ఎత్తులో ఈ రైల్వే వంతెనను నిర్మించారు. దీని పొడవు 1315 మీటర్లు. ఇప్పటివరకూ చైనాలోని బెయిపాన్ నదిపై ఉన్న షుబాయ్ రైల్వే వంతెన (275 మీటర్ల ఎత్తు) పేరుతో ఉన్న ప్రపంచరికార్డును ఇది అధిగమించింది. ఈఫిల్ టవర్ కంటే చీనాబ్ వంతెన ఎత్తు 30 మీటర్లు ఎక్కువ.

You may also like
supreme court
ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions