India gifts 20 ambulances to Afghanistan as a gesture of goodwill | భారత్-అఫ్గానిస్థాన్ దోస్తీ మరింత బలపడనుంది. ఈ మేరకు భారత్ పర్యటనలో ఉన్న అఫ్గాన్ విదేశాంగ మంత్రి ఆమిర్ ఖాన్ ముత్తాఖీ తో కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఇందులో భాగంగా అఫ్గాన్ ప్రజల ఆరోగ్య భద్రత కోసం 20 అంబులెన్సులను ఇవ్వనున్నట్లు జైశంకర్ ప్రకటించారు. ఈ మేరకు స్వయంగా ఐదు అంబులెన్సులను కేంద్రమంత్రి అఫ్గాన్ మంత్రి ముత్తాఖీకి అందజేశారు. అఫ్గాన్ ప్రజల ఆరోగ్య సేవలను మెరుగుపరచడానికి సహాయపడతాయని తెలిపారు. MRI, CT స్కాన్ మెషీన్లు, టీకాలు, క్యాన్సర్ మందులు భారత ప్రభుత్వం అందించనున్నది.
ఈ క్రమంలో ఆయన భారత్ కు కృతజ్ఞతలు తెలియజేశారు అఫ్గాన్ మంత్రి ముత్తాఖీ. అలాగే వాణిజ్యం, మానవతా సహాయం కోసం అఫ్గాన్ రాజధాని కాబూల్ నిర్వహిస్తున్న టెక్నికల్ మెషీన్ ను పూర్తిస్థాయి దౌత్య కార్యాలయంగా మార్చనున్నట్లు కేంద్రమంత్రి స్పష్టం చేశారు.









