Hydraa Commissioner Ranganath | హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ (AV Ranganath) శనివారం మీడియాతో మాట్లాడుతూ పలు కీలక విషయాలు వెల్లడించారు. ప్రజలు నోటరీ స్థలాలు, ఆస్తులు కొనేటప్పుడు కాస్త ఆలోచించాలని సూచించారు.
వాటిని రెండు మూడు రకాలుగా క్షుణ్నంగా పరిశీలించి కొనుగోలు చేయాలని తెలిపారు. అనుమతి లేని నిర్మాణాల్లో వ్యాపారాలు నిర్వహించే వారు ఇచ్చిన వెంటనే ఖాళీ చేయడానికి సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు.
ఇండ్లు, ప్లాట్స్ కొనే వారి కోసం.. బఫర్, ఎఫ్టీఎల్‌లో ఉన్నాయా లేవా తెలిపేందుకు హైడ్రాకు ఒక వెబ్ సైట్ ఏర్పాటు చేస్తామన్నారు. జూలై 19వ తేదీకి ముందు కట్టిన వాటిని హైడ్రా కూల్చదని రంగనాథ్ స్పష్టం చేశారు.
అనుమతులు లేకుంటే మాత్రం కూల్చేస్తామని హెచ్చరించారు. హైడ్రా ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు 200 ఎకరాలను కాపాడినట్టు తెలిపారు. 2025లో 12 చెరువులు హైడ్రా సుందరీకరించాలని టార్గెట్ పెట్టుకుందని రంగనాథ్ వెల్లడించారు.