N Convention Demolition | టాలీవుడ్ ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) కు బిగ్ షాక్ ఇచ్చారు హైడ్రా అధికారులు. హైదరాబాద్ లోని అక్రమ కట్టడాలే లక్ష్యంగా చెరువుల పరిరక్షణ కోసం సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా ను తీసుకువచ్చిన విషయం తెల్సిందే. ఎఫ్టీఎల్ (FTL), బఫర్ జోన్ (Buffer Zone)లో చేపట్టిన నిర్మాణాలను హైడ్రా (HYDRA)ఆధ్వర్యంలో కూల్చివేస్తున్నారు.
అందులో భాగంగా మాదాపూర్ (Madhapur)లోని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ (N Convention Centre) ను శనివారం ఉదయం హైడ్రా కూల్చివేసింది. ఎన్ కన్వెన్షన్ వద్ద భారీ బందోబస్తు నడుమ ఈ కూల్చివేత కార్యక్రమం చేపట్టింది. తమ్మిడి కుంట చెరువును కబ్జా చేసి కన్వెన్షన్ ను నిర్మించారనే ఆరోపణలు ఉన్నాయి. సుమారు మూడున్నర ఎకరాల భూమిని కబ్జా చేసారని అధికారులకు ఫిర్యాదులు అందాయి.