Free IPL Tickets | ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 18వ సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటి వరకు జరిగిన మ్యాచుల్లో పరుగుల వరద పారింది. భారీ స్కోర్లు, ఛేజింగ్ లు నమోదవుతున్నాయి.
సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) తొలి మ్యాచ్ లోనే 286 భారీ స్కోర్ చేసి ఐపీఎల్ కు మరింత క్రేజ్ తీసుకొచ్చింది. తాజాగా గురువారం లక్నో సూపర్ జెయింట్స్ తో (SRH Vs LSG) ఉప్పల్ స్టేడియంలో రెండో మ్యాచ్ ఆడుతోంది.
Read Also: ఆ 16 రోజులు ఒక్క మనిషిని కూడా చూడలేదు: సీఎం రేవంత్
ఈ నేపథ్యంలో ఐపీఎల్ క్రేజ్ దృష్ట్యా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఓ కీలక ప్రకటన చేసింది. ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ లను ప్రత్యక్షంగా వీక్షించాలనుకునే దివ్యాంగులకు ఉచితంగా ఐపీఎల్ పాస్లు జారీ చేస్తామని ప్రకటించింది.
ఈ టికెట్లు కావాల్సిన వారు పూర్తి వివరాలను pcipl18rgics@gmail.com మెయిల్ కి పంపడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని హెచ్సీఏ వెల్లడించింది. సీట్లు పరిమితంగా ఉంటాయి కనుక మొదట వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ప్రాధాన్యత ఆధారంగా పాస్లు జారీ చేస్తామని తెలిపింది.