Saturday 28th March 2026
12:07:03 PM
Home > తాజా > మీట్ యువర్ సీపీ.. హైదరాబాద్ కొత్వాల్ సజ్జనర్ సరికొత్త కార్యక్రమం!

మీట్ యువర్ సీపీ.. హైదరాబాద్ కొత్వాల్ సజ్జనర్ సరికొత్త కార్యక్రమం!

vc sajjanar

Meet Your CP | ఏ పదవిలో ఉన్న వినూత్న సంస్కరణలతో ప్రజలకు మరింత చేరువ అవడం హైదరాబాద్ సీపీ సజ్జనర్ (CP VC Sajjanar) కు వెన్నతో పెట్టిన విద్య. గతంలో ఆర్టీసీ ఎండీగా పనిచేసిన ఆయన కొత్త స్కీంలతో ప్రజలను ఆకట్టుకునేలా ఆర్టీసీని తీర్చిదిద్దారు.

ప్రస్తుతం హైదరాబాద్ సీపీగా ఉన్న ఆయన ప్రజలకు, పోలీసులకు మధ్య సంబంధాలు బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నగరవాసులు తమ సమస్యలు, ఫిర్యాదులు, సూచనలను నేరుగా కమిషనర్‌కే తెలియజేసేందుకు వీలుగా ‘మీట్ యువర్ సీపీ’ (Meet Your CP) కార్యక్రమాన్ని ప్రారంభించారు.

దీని ద్వారా ఎలాంటి ముందస్తు అపాయింట్‌మెంట్ అవసరం లేకుండానే ప్రజలు సీపీని కలిసి తమ సమస్యలను వివరించుకోవచ్చు. ఈ కార్యక్రమం ఈ వారం నుంచే అమల్లోకి వచ్చింది. ప్రతిరోజూ మధ్యాహ్నం 2 గంటల నుంచి బంజారాహిల్స్‌ లోని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (TGICCC)లో ఉన్న పోలీస్ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ ప్రజలకు అందుబాటులో ఉంటారు.

పాతబస్తీ వాసులు సుదూరం ప్రయాణించాల్సిన అవసరం లేకుండా ప్రతి శుక్రవారం పురానీ హవేలీలోని కోత్వాల్ హౌస్‌లో ప్రత్యేకంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. శాంతిభద్రతలు, ట్రాఫిక్ నిర్వహణ, స్థానిక భద్రత వంటి అనేక అంశాలపై ప్రజల నుంచి నేరుగా అభిప్రాయాలు స్వీకరించి, వాటిని సత్వరమే పరిష్కరించడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు.

‘మీట్ యువర్ సీపీ’ కార్యక్రమం గురించి కమిషనర్ సజ్జనార్ తన ‘ఎక్స్’ ఖాతా ద్వారా ఒక వీడియోను పంచుకున్నారు. ప్రజలతో నేరుగా మమేకమవడం ద్వారా వారిలో పోలీసులపై నమ్మకాన్ని పెంచవచ్చని, ఈ అవకాశాన్ని నగరవాసులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.  

You may also like
tg cabinet meeting
తల్లిదండ్రులను చూడని ఉద్యోగులకు షాక్!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions