Hyderabad City Civil Court On Pawan Kalyan | ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ( Deputy Cm Pawan Kalyan ) కు ఊహించని షాక్ ఎదురైంది. తిరుమల లడ్డూ ( Tirumala Laddoo ) లో కల్తీ నెయ్యి వాడారనే ఆరోపణల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెల్సిందే.
ఈ క్రమంలో తిరుమల లడ్డూపై పవన్ చేసిన వ్యాఖ్యలపై న్యాయవాది రామారావు హైదరాబాద్ సిటీ కోర్టు ( Hyderabad City Civil Court )లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఏడాది జనవరిలో అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా, ఏపీ ప్రభుత్వం తిరుమల లడ్డులను పంపించిన విషయం తెల్సిందే.
అయితే అయోధ్యకు పంపిన లడ్డూలో కూడా జంతు కొవ్వును వాడారని డిప్యూటీ సీఎం పవన్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో హిందువుల మనోభావాలు దెబ్బతీశేలా పవన్ వ్యాఖ్యలు ఉన్నాయని న్యాయవాది పిటిషన్ లో పేర్కొన్నారు.
సదరు వీడియోలను సోషల్ మీడియా ( Social Media ) నుండి తొలగించాలని కోరారు. పిటిషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం, నవంబర్ 22న వ్యక్తిగతంగా కోర్టులో హాజరుకావాలని ఆదేశించింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం పవన్ తో పాటు తెలంగాణ సీఎస్ శాంతికుమారి ( CS Shantikumari )కి న్యాయస్థానం సమన్లు జారీ చేసింది.