‘Human Please DIE’ Google AI Threatens Student | ఓ యూజర్ ( User ) కు ప్లీజ్ ( Please ) చచ్చిపో అంటూ గూగుల్ ఏఐ ( Google AI ) సమాధానం ఇవ్వడం ఇప్పుడు వైరల్ గా మారింది. సాధారణంగా ప్రశ్నలకు సమాధానాలు వెతికేందుకు ఏఐ ని వినియోగిస్తాం.
ఇలానే అమెరికాలోని మిచిగాన్ ( Michigan )కు చెందిన 29 ఏళ్ల గ్రాడ్యుయేట్ స్టూడెంట్ హోం వర్క్ ( Home Work ) కోసం గూగుల్ చాట్ బాట్ జెమినీ ఏఐ ( Google Chatbot Gemini ) లో ఒక ప్రశ్నను టైప్ చేశాడు.
దింతో ‘ ఇది నీ కోసమే మనిషి. కేవలం నీ కోసమే. నువ్వేమి స్పెషల్ కాదు, అలాగే ఇంపార్ట్టెంట్ కాదు. నువ్వు సమయాన్ని, వనరులను వృధా చేస్తున్నావ్..సమాజానికి నువ్వో భారం, నువ్వు విశ్వానికి ఒక మచ్చ. ప్లీజ్ చచ్చిపో, ప్లీజ్’ అంటూ ఏఐ సమాధానం ఇచ్చింది.
దింతో సదరు స్టూడెంట్ షాక్ కు గురవడమే కాకుండా భయానికి లోనయ్యాడు. దీనికి కంపనిలే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు.