Thursday 21st November 2024
12:07:03 PM
Home > తాజా > ఓటర్ స్లిప్ అందలేదా.. కంగారొద్దు ఇలా పొందండి!

ఓటర్ స్లిప్ అందలేదా.. కంగారొద్దు ఇలా పొందండి!

id card

How To Get Voter Slip | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా ఓటర్లకు స్లిప్పుల పంపిణీ వేగంగా జరుగుతోంది. ప్రతి ఇంటికి వెళ్లి  ఓటర్ స్లిప్పులను అందించడానికి బూత్ లెవల్ ఆఫీసర్లకు బాధ్యతలు అప్పజెప్పారు.

అయినప్పటికీ చాలా మందికి ఓటర్ స్లిప్పులు ఇంకా అందలేదనే ఫిర్యాదులు వస్తున్నాయి. లిస్టులో తమ పేరు ఉన్నా ఇంకా ఓటర్ స్లిప్ అందలేదని వాపోతున్నారు. అయితే ఓటర్ స్లిప్ ఫిజికల్ గా అందకపోయినా ఆన్ లైన్ ద్వారా పొందే అవకాశం ఉంది.

ఇలా చేయండి ..
ఎన్నికల సిబ్బంది నుంచి ఓటర్ స్లిప్పులు అందకపోతే ఆన్‌లైన్ ద్వారా, మొబైల్ యాప్ ద్వారా, హెల్ప్ లైన్ నెంబర్ ద్వారా, మొబైల్ ఎస్ఎంఎస్ ద్వారా పొందడానికి ఎన్నికల సంఘం వెసులుబాటు కల్పించింది.

ఒక్క మెసేజ్‌తో.. ఓటరు గుర్తింపు కార్డు నెంబర్‌ను టైప్ చేసి 1950 లేదా 9211728082 అనే నెంబర్‌కు SMS పంపితే వివరాలు వస్తాయి.

ఆన్‌లైన్‌లో అయితే.. www.ceotelangana.nic.in అనే వెబ్‌సైట్‌లో సెర్చ్ యువర్ నేమ్-అసెంబ్లీ-ఓటర్స్ సర్వీస్ పోర్టల్ మెనూ ద్వారా ఓటరు గుర్తింపు కార్డు లేదా మొబైల్ నెంబర్ లేదా పేరును ఇవ్వడం ద్వారా ఏ నెంబర్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేయవచ్చో తెలుసుకోవడంతో పాటు డిజిటల్ స్లిప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

www.electoralsearch.eci.gov.in అనే వెబ్‌సైట్ ద్వారా ఇవే వివరాలను పొందుపర్చి ఓటర్ డిజిటల్ స్లిప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

వీటితో పాటు www.voters.eci.gov.in అనే వెబ్‌సైట్‌లో సెర్చ్ ఇన్ ఎలక్టోరల్ రోల్ అనే ఆప్షన్‌ను సెలెక్టు చేసుకొని ఓటరు వివరాలను పొందుపర్చడం ద్వారా కూడా తెలుసుకోవచ్చు.

www.ceotelangana.nic.in అనే వెబ్‌సైట్‌లో ఆఫీసర్స్ డీటెయిల్స్ – బూత్ లెవల్ ఆఫీసర్స్ డీటెయిల్స్ అనే ఆప్షన్ ద్వారా జిల్లా, నియోజకవర్గం, అక్కడి పోలింగ్ కేంద్రాల వారీగా బి ఎల్ వోల ఫోన్ నెంబర్లను తెలుసుకుని వారికి ఫోన్ చేసి బూత్ నెంబర్ వివరాలను పొందొచ్చు.  

You may also like
Election commission
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ.. బరిలో ఎంతమందంటే!
BSP contested in 108 seats but could not win a single seat
108 చోట్ల పోటీ చేసినా ఒక్క సీటూ గెల్చుకోలేకపోయిన బీఎస్పీ
BRS Cong Flags
రాష్ట్రంలో కాంగ్రెస్.. రాజధానిలో బీఆరెస్.. అనూహ్య ఫలితాలు!
rsp
రేవంత్ కు అభినందనలు.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions