How To Find A Fake Website | బ్రాండెడ్ సంస్థల వెబ్సైట్ ( Website ) ను పోలె విధంగా నకిలీ ( Fake ) వెబ్సైట్ ను రూపొందించి సైబర్ నేరగాళ్లు అమాయక ప్రజల నుండి రూ.లక్షల లాగేస్తున్నారు.
నకిలీ వెబ్సైట్ – ఒరిజినల్ ( Original ) వెబ్సైట్ మధ్య తేడాను గుర్తించలేక సైబర్ వలలో చిక్కుకుంటున్నారు. ఈ క్రమంలో ఒరిజినల్ వెబ్సైట్ ను వెతుక్కోవడం ఎలా అని పలువురు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.
ఏదైనా వెబ్ సైట్ పేరులో URL ఉంటే కచ్చితంగా దీనికి ముందు HTTP అని ఉంటుంది. అలా లేదంటే అది నకిలీ వెబ్ సైటే అని గుర్తుపెట్టుకోవాలి. వెబ్ సైట్ ఓపెన్ చేసిన వెంటనే మరో వెబ్సైట్ కి వెళుతుంటే కచ్చితంగా అది నకిలీదని గమనించాలి.
వెబ్ సైట్ ఒరిజినలే అని తెలుసుకోవాలంటే డొమైన్ తనిఖీ చేయాలి. బ్రాండెడ్ వెబ్ సైట్లలో అక్షరాలను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి. అలాగే ప్రభుత్వ వెబ్ సైట్ అయితే gov.in అని కచ్చితంగా ఉంటుంది.
ప్రజలు వీటిని గమనించి వెబ్ సైట్ ఓపెన్ చేయాలని అధికారులు సూచిస్తున్నారు. అనుమానాస్పదంగా ఏదైనా వెబ్ సైట్ ఉంటే 1930 కి ఫిర్యాదు చేయాలి.