Hidden Cameras in Girls’ Hostel | ఇంజనీరింగ్ కాలేజిలోని యువతుల బాత్రూమ్ ( Washroom ) ల్లో సీక్రెట్ కెమెరాలు పెట్టారని ఆరోపిస్తు విద్యార్థినీలు ఆందోళన చేయడం సంచలనంగా మారింది.
కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు (Gudlavalleru )లోని ఇంజినీరింగ్ కాలేజీ ( Engineering College )లో సీక్రెట్ కెమెరాల ( Hidden Cameras ) ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో బాలికల హాస్టల్ వాష్ రూమ్ లో సీక్రెట్ కెమెరాలు ఉన్నాయని ఆరోపిస్తూ గురువారం అర్ధరాత్రి విద్యార్థినీలు ఆందోళన చేపట్టారు.
ఈ క్రమంలో కాలేజీలో హైడ్రామా నెలకొంది. సీక్రెట్ కెమెరాల ద్వారా రహస్యంగా వీడియోలు చిత్రీకరించి, వాటిని విక్రయిస్తున్నాడని బీటెక్ విద్యార్థిపై విద్యార్థినీలు దాడికి యత్నించారు.
విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపుచేశారు. అనంతరం సీనియర్ విద్యార్థి విజయ్ ని ప్రశ్నించారు. అతనికి చెందిన లాప్టాప్, సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు.
ఇదిలా ఉండగా విజయ్ కి మరో విద్యార్థిని సహకరించిందనే ఆరోపణలు వస్తున్నాయి.