Harsh Goenka predicts gold’s future | బంగారం ధరలు ఆకాశమే హద్దుగా భారీగా పెరిగిపోతున్నాయి. పుత్తడిలో పెట్టుబడి ఎప్పటికైనా లాభమే అని ఎప్పటినుంచో చెబుతున్న సమేత నిరూపితం అవుతూనే ఉంది. పసిడి ధరలు పైపైకి వెళ్తున్న క్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త, ఆర్పీజి గ్రూప్ ఛైర్మన్ హార్ష్ గోయెంకా ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.
కేజీ బంగారంతో 2030 నాటికి ఏకంగా రోల్స్ రాయిస్ కారే వస్తుందని అంచనా వేశారు. 2040 నాటికి ప్రైవేట్ జెట్ కూడా కొనొచ్చని పేర్కొన్నారు. ఈ మేరకు గతంలో కేజీ బంగారంతో కొనగలిగే కారు వివరాలను తెలియజేశారు. 1990లో కేజీ బంగారంతో మారుతి 800, 2000లో ఎస్టీమ్, 2005లో కేజీ బంగారంతో ఇన్నోవా కారు, 2010లో ఫార్చునర్, 2019లో బీఎండబ్ల్యూ, 2025లో ల్యాండ్ రోవర్ కారును కొనుగోలు చేయొచ్చని వెల్లడించారు. కాగా ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది.









