Friday 30th January 2026
12:07:03 PM
Home > క్రీడలు > BRS Vs Congress: సరదాగా క్రికెట్ఆడిన మంత్రి, మాజీ మంత్రి!

BRS Vs Congress: సరదాగా క్రికెట్ఆడిన మంత్రి, మాజీ మంత్రి!

Ex minister and Minister play Cricket | ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య వాడివేడి వాతావరణం ఉంది. ఇరు పక్షాల నేతల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేంతలా మాటల యుద్దం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల మధ్య అధికార, ప్రతిపక్ష నేతల మధ్య ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల కీలక నేతలు మంత్రి, మాజీ మంత్రి ఓ కార్యక్రమంలో సరదాగా క్రికెట్ ఆడి అందరినీ అలరించారు. ఆదివారంయూసఫ్ గూడ పోలీసు పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన డిజిటల్ మీడియా ప్రీమియర్ లీగ్ జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్.. మాజీ మంత్రి హరీశ్ రావు ఇద్దరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇద్దరూ సరదాగా క్రికెట్ ఆడారు. మంత్రి పొన్నం ప్రభాకర్ బౌలింగ్ చేయగా, మాజీ మంత్రి హరీశ్ రావు బ్యాటింగ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

You may also like
police as mother
ఖాకీ దుస్తుల కాఠిన్యం వెనక కరిగిన అమ్మ మనసు.. వీడియో వైరల్!
harish rao pressemeet
రైతుల నోట్లో మట్టి కొట్టి.. బీరు ఫ్యాక్టరీలకు నీళ్లిస్తారా?
ajit and sharad powar
అజిత్ పవార్ మృతిపై శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు!
ponguleti srinivasa reddy
దేశానికే రోల్‌మోడ‌ల్‌గా తెలంగాణ డిజాస్ట‌ర్ మేనేజిమెంట్‌!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions