Saturday 26th July 2025
12:07:03 PM
Home > క్రీడలు > ఇషాన్ కిషన్ పై హార్దిక్ పాండ్య ఎమోషనల్

ఇషాన్ కిషన్ పై హార్దిక్ పాండ్య ఎమోషనల్

Hardik Pandya On Ishan Kisan | ఐపీఎల్ మెగా ఆక్షన్ ( IPL Mega Auction ) లో ఇషాన్ కిషన్ ను రూ.11.25 కోట్లకు హైదరాబాద్ ( Sunrisers Hyderabad ) కొనుగోలు చేసింది.

సుమారు ఆరేళ్ళ పాటు ముంబై ఇండియన్స్ ( Mumbai Indians ) తరఫున ఇషాన్ కిషన్ ఐపీఎల్ ఆడిన విషయం తెల్సిందే. ఈ క్రమంలో ముంబై ఇషాన్ కిషన్ ను మిస్ అవుతుందని ఎంఐ కెప్టెన్ హార్దిక్ పాండ్య ( MI Captain Hardik Pandya ) చెప్పారు.

ఇషాన్ డ్రెసింగ్ రూమ్ కు ఒక ఎనర్జీని తీసుకువచ్చేవాడు, అందర్నీ నవ్వించేవాడు, తన ప్రేమ, ఆప్యాయత స్వచ్ఛమైనవి అని హార్దిక్ ఇషాన్ తో తన జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.

ఇషాన్ ఎల్లప్పుడూ ముంబై ఇండియన్స్ కు ఒక పాకెట్ డైనమైట్ ( Pocket Dynamo ) లా ఉండేవాడు, ఇప్పుడు వేరే టీంకు వెళ్ళిపోయాడు, కానీ అతడ్ని మేము ఎప్పుడూ మిస్ అవుతూనే ఉంటాం అని పాండ్య పేర్కొన్నారు.

ముంబై ఇషాన్ ను రిటైన్ చేసుకొనప్పుడే అతన్ని తిరిగి దక్కించుకోవడం కష్టమని తెలుసు. ఎందుకంటే అతని స్కిల్స్ ( Skills ) అలాంటివి, ఇతర ఫ్రాంచైజీలు ఇషాన్ కోసం కచ్చితంగా పోటీ పడతాయని తాను ముందుగానే ఉహించినట్లు హార్దిక్ చెప్పుకొచ్చారు.

You may also like
ఇందిరా గాంధీ రికార్డు బ్రేక్ చేసిన నరేంద్రమోదీ
WWE లెజెండ్ హల్క్ హోగన్ మృతి
‘అంబేద్కర్ బాటలోనే కేసీఆర్ ఉద్యమించారు’
‘చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలు సూపర్ ప్లాప్’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions