Hamida Bano Returns To India From Pak After 22 Years | గత 22 ఏళ్లుగా పాకిస్తాన్ ( Pakistan ) దేశంలో చిక్కుకుపోయిన మహిళ ఎట్టకేలకు స్వదేశానికి చేరుకుంది.
పాకిస్తాన్ యుట్యూబర్ ( Youtuber ) కారణంగా ఆమె పాక్ లో చిక్కుకున్నట్లు ప్రపంచానికి తెలిసింది. వివరాల్లోకి వెళ్తే ముంబైకి చెందిన హామీదా బానో ( Hamida Bano ) భర్త మరణించడంతో దోహా, దుబాయ్, సౌదీ వంటి దేశాల్లో వంతమనిషిగా పనిచేస్తూ ముంబైలోని తన పిల్లలకు డబ్బులు పంపేవారు.
ఈ క్రమంలో 2002లో దుబాయ్ వెళ్లేందుకు ఆమె ప్రయత్నించగా ఏజెంట్ ( Agent ) మోసం చేసాడు. పాకిస్తాన్ లోని హైదరాబాద్ కు ఆమెను తరలించారు. దింతో గత 22 ఏళ్లుగా ఆమె అక్కడే ఉన్నారు. 2022లో వలీవుల్లా మరూఫ్ అనే యూట్యూబర్ కారణంగా ఆమె విషయం బయటకు వచ్చింది.
అప్పటి నుండి ఆమెను స్వదేశానికి తీసుకురావడానికి కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. అధికారుల సహాయంతో తాజగా ఆమెను పాకిస్తాన్ కరాచీ నుండి లాహోర్ కు అక్కడి నుండి వాఘా బార్డర్ మీదుగా ఇండియాకు తీసుకువచ్చారు. ఈ మేరకు విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.