Gummadi Narsaiah News | తాను ఐదు సార్లు ఎమ్మెల్యే గా గెలిచానని, ప్రజా సమస్యలను విన్నవించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Cm Revanth Reddy ) కలవాలని భవిస్తుంటే కలవలేకపోతున్నట్లు ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ గా మారింది.
ఈ మేరకు ఆయన మాట్లాడుతున్న ఒక వీడియో వైరల్ గా మారింది. తెలిసిన నేతలకు, అధికారులకు ఫోన్ చేస్తే రమ్మంటున్నారని, కానీ ముఖ్యమంత్రి నివాసం వద్దకు వెళ్ళగానే ఆపేస్తున్నారని గుమ్మడి నర్సయ్య వాపోయారు.
సీతారామ ప్రాజెక్టు, పోడు భూములు, చెక్ డ్యాములు తదితర అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఇప్పటివరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవాలని నాలుగు సార్లు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందన్నారు.