Saturday 31st January 2026
12:07:03 PM
Home > క్రీడలు > రోహిత్ స్థానంలో బుమ్రాను కెప్టెన్ చేయాలి.. గావస్కర్ కీలక వ్యాఖ్యలు

రోహిత్ స్థానంలో బుమ్రాను కెప్టెన్ చేయాలి.. గావస్కర్ కీలక వ్యాఖ్యలు

Gavaskar On Rohit Captaincy | భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ ( Sunil Gavaskar ) కీలక వ్యాఖ్యలు చేశారు. బోర్డర్ – గావస్కర్ ( Border – Gavaskar ) సిరీస్ నవంబర్ 22న ఆస్ట్రేలియాలో మొదలవనుంది.

అయితే తొలి టెస్టుకు కెప్టెన్ రోహిత్ శర్మ ( Rohit Sharma ) దూరం అవుతారనే వార్తలు వస్తున్నాయి. తన భార్య రెండవ బిడ్డకు జన్మనివ్వనుండడంతో రోహిత్ తొలి మ్యాచ్ కు లేదా రెండు మ్యాచులకు దూరం అయ్యే అవకాశం కనిపిస్తోంది.

దింతో పెర్త్ ( Perth ) లో జరగబోయే టెస్టుకు బుమ్రా ( Jasprit Bumrah )నాయకత్వం వహించనున్నాడు. ఈ క్రమంలో స్పందించారు గావస్కర్. ఒక కెప్టెన్ తొలి మ్యాచులో ఆడడం చాలా కీలకం అని గావస్కర్ చెప్పారు. కెప్టెన్ ( Captain ) అందుబాటులో లేకపోతే వైస్ కెప్టెన్ పై తీవ్ర ఒత్తిడి ఉంటుందని తెలిపారు.

ఆస్ట్రేలియాతో జరగబోయే తొలి రెండు టెస్టులకు రోహిత్ దూరం అవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి, ఇదే నిజం అయితే ఆస్ట్రేలియాతో సిరీస్ మొత్తానికి బుమ్రాను కెప్టెన్ గా నియమిస్తూ సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకోవాలని గావస్కర్ సూచించారు. రోహిత్ ప్లేయర్ గా అడుతాడాని పేర్కొన్నారు.

You may also like
మేడారంలో అద్భుత దృశ్యం..జనంలోకి సమ్మక్క
పోలీసులకు గుడ్ న్యూస్..బర్త్ డే, పెళ్లి రోజున సెలవులు
కేసీఆర్ కు నోటీసులు..’సూర్యుడిపై ఉమ్మివేయడమే’
తల్లి పుట్టినరోజు..జిరాఫీలను దత్తత తీసుకున్న పవన్

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions