Game Changer Pre Release Event | గ్లోబల్ స్టార్ రాంచరణ్ ( Ram Charan ) కథానాయకుడిగా దర్శకుడు శంకర్ తెరకెక్కించిన మూవీ గేమ్ ఛేంజర్. జనవరి 10న ఈ సినిమా విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం వేమగిరిలో ఈవెంట్ కు సంబంధించిన ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ( Deputy Cm Pawan Kalyan ) ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరవనున్నారు.
దింతో బాబాయ్-అబ్బాయ్ ఒకే వేదికపై కనిపించనుండడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ( Kandula Durgesh ) ఈవెంట్ ఏర్పాట్లను పరిశీలించారు.
కలెక్టర్ ప్రశాంతి, జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ తో మాట్లాడారు. అభిమానుల తాకిడికి దృష్టిలో ఉంచుకుని తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఇది అభిమానులకు కన్నులపండుగ కానుందని మంత్రి పేర్కొన్నారు.