Wednesday 4th March 2026
12:07:03 PM
Home > తెలంగాణ > స్నహమేరా జీవితం..స్నేహమేరా శాశ్వతం..

స్నహమేరా జీవితం..స్నేహమేరా శాశ్వతం..

Friendship is life.. Friendship is eternal..
  • నా కోసం కష్టపడిన స్నేహితుల రుణం తీర్చుకుంటా.
  • షాద్‌నగర్‌ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌.
  • చిన్ననాటి స్నేహితున్ని సన్మానించి,అభినందించారు.

నందిగామ :స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం అని ఓ సినిమా రచయిత పాట గుర్తుకు వస్తుంది.ఒకే మండలం, ఒకే బడిలో చదివి, రాజకీయాల్లో సైతం మిత్రుని కోసం అహర్నిశలు శ్రమించి,అధికార పార్టీ పోరును తట్టుకుని, స్నేహం కోసం రాత్రనక, పగలనక అవిశ్రాంతిగా కష్టపడి ఎమ్మెల్యేగా వీర్లపల్లి శంకర్‌ గెలిచేందుకు కష్టపడిన చిన్ననాటి స్నేహి తుడు దార యాదయ్యను శుక్రవారం ఎమ్మెల్యే నివాసంలో పూలదండ వేసి ఘనంగా సన్మానించి అభినందించారు. 10వ తరగతి 1986వ సంవత్సరంలో కలిసి చదివిన స్నేహితులందరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విద్యాబుద్దులు నేర్చుకున్నా పాఠశాల,ఉపాద్యాయుల,తోటి స్నేహితుల బుణం తీర్చుకుంటామన్నారు.తాను ఎమ్మెల్యేగా గెలవడానికి కృషి చేసిన నియోజకవర్గ ప్రజలందరికి ఋణపడి ఉంటూ ప్రతి క్షణం అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పాత్రికేయులు శ్రీహరి, సంతోష్‌,సందీప్‌, చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

You may also like
వెలుగుమట్ల నిర్వాసితులకు పట్టాలు: మంత్రి
kalvakuntla kavitha
‘ఎస్సీల రిజర్వేషన్లు 18 శాతానికి పెంచాలి’
రాష్ట్రంలో కాంగ్రెస్ బుల్డోజర్ రాజ్యం
‘బీఆర్ నాయుడు కాదు..బీఆర్ కామ నాయుడు’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions