Death Sentence for Five | ఆంధ్ర ప్రదేశ్ లోని చిత్తూరు అదనపు జిల్లా కోర్టు (Chittoor Court) సంచలన తీర్పు వెలువరించింది. 2015 నవంబర్ 17న నాటి చిత్తూరు మేయర్ కఠారి అనురాధ (Kathari Anuradha), ఆమె భర్త మోహన్ (Kathari Mohan)ల హత్య ఘటన సంచలనం సృష్టించింది.
ఆ కేసులో మొదట మొత్తం 23 మందిని దోషులుగా పేర్కొన్నారు. సుదీర్ఘ విచారణ అనంతరం మేయర్ భర్త మోహన్ మేనల్లుడు శ్రీరామ్ చంద్రశేఖర్ అలియాస్ చింటూ(ఏ1), గోవింద స్వామి శ్రీనివాసయ్య వెంకటాచలపతి అలియాస్ వెంకటేష్(ఏ2), జయప్రకాష్ రెడ్డి అలియాస్ జయారెడ్డి(ఏ3), మంజునాథ్ అలియాస్ మంజు(ఏ4), మునిరత్నం వెంకటేష్(ఏ5)లు ప్రధాన దోషులుగా తేలారు.
తాజాగా ఈ కేసులో న్యాయమూర్తి ఎన్. శ్రీనివాస రావు ఈ ఐదుగురు దోషులకు ఉరిశిక్ష ఖరారు చేస్తూ తీర్పు వెలువరించారు.









