Tuesday 17th March 2026
12:07:03 PM
Home > తాజా > తెలంగాణ ఎన్నికల్లో తొలి ఓటు నమోదు.. వేసింది ఎవరంటే..!

తెలంగాణ ఎన్నికల్లో తొలి ఓటు నమోదు.. వేసింది ఎవరంటే..!

telangana elections

Telangana Elections | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సంబంధించి తొలి ఓటు నమోదయింది. నవంబర్ 30న జరగనున్న ఎన్నికలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది ఎన్నికల సంఘం.

పోలింగ్ బూత్ కు రాలేని వృద్ధులు, వికలాంగులకు ఓట్ ఫ్రమ్ హోమ్ అనే సదుపాయాన్ని కల్పించింది. ఇందులో భాగంగా ఇంటి నుండి ఓటు ప్రక్రియ ప్రారంభం అయింది.

ఇందులో భాగంగా నవంబర్ 21న ఖైరతాబాద్ నియోజకవర్గానికి చెందిన 91 ఏండ్ల అన్నపూర్ణ చండూరి తన ఇంటి వద్ద నుండే ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఎన్నికల అధికారులు, పోలీసులు పోస్టల్ బ్యాలెట్ ను ఆమె ఇంటికి తీసుకెళ్లారు. కాగా ఇంటి నుండి ఓటు వేసే సదుపాయాన్ని వినియోగించుకోవడానికి, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన ఐదు రోజుల్లో ఫారం 12-డిని ఉపయోగించి రిటర్నింగ్ అధికారి కి దరఖాస్తును సమర్పించారు.

మొత్తం 28 వేల 57 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఇంటి నుండి ఓటు హక్కు ను ఉపయోగించుకొనున్నారు. కాగా తెలంగాణ ఎన్నికల్లో తొలి ఓటు వేయడం ద్వారా అన్నపూర్ణ చండూరి వార్తల్లో నిలిచారు.

You may also like
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Minister Adluri Laxman
‘గోదావరి పుష్కరాలు ఘనంగా నిర్వహించాలి’
KTR press meet
‘ఆరు గ్యారెంటీ ల కోసం ప్రైవేట్ మెంబర్ బిల్లు పెడతాం’
engineering fee in tg
రాష్ట్రంలో ఇంజనీరింగ్ ఫీజులు ఖరారు.. అత్యధికం ఎంతంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions