FIR against Rana Daggubati, Prakash Raj, Vijay Devarakonda and Manchu Lakshmi for promoting betting apps | బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సలర్లపై తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటికే పలువురి పై కేసు నమోదు చేశారు.
తాజగా టాలీవుడ్ నటులు దగ్గుబాటి రానా, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్ పై కూడా బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసినందుకు కేసు నమోదు చేశారు. ఈ మేరకు మియాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. వీరితో పాటు మంచు లక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్, యాంకర్లు రీతూ చౌదరీ, శ్రీముఖి, శ్యామలపై కేసు నమోదైంది.
కాగా బెట్టింగ్ యాప్స్ వలలో చిక్కి వందల సంఖ్యలో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారని, గత కొంతకాలంగా బెట్టింగ్ యాప్స్ కు వ్యతిరేకంగా సీనియర్ ఐపీఎస్ అధికారి సజ్జనర్ సోషల్ మీడియా వేదికగా అవగాహన కల్పిస్తున్న విషయం తెల్సిందే.