Key Post For Eatala | భారతీయ జనతా పార్టీ ఈ సంవత్సరం చివరిలో జరిగే అసెంబ్లీ ఎన్నికలు, 2024లో జరిగే సర్వత్రా ఎన్నికలే లక్ష్యంగా పలు రాష్ట్రాల అధ్యక్షులను మార్చింది. పలువురు నేతలకు కీలక పదవులని కట్టబెట్టింది.
ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని నియమిస్తూ నిర్ణయం తీసుకుంది కమలం పార్టీ.
ఆంధ్రప్రదేశ్ లో మాజీ కేంద్రమంత్రి , స్వర్గీయ ఎన్టీఆర్ కూతురు పురందేశ్వరిని బీజేపీ అధ్యక్షరాలిగా నియమించింది.
అలాగే తెలంగాణ ఉద్యమం నాయకుడు, మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ను ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ గా బీజేపీ నియమించింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి చాలా సంవత్సరాలు రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
కానీ కొద్దీ రోజుల క్రితం ఆయన బీజేపీ లో చేరారు. ప్రస్తుతం కిరణ్ కుమార్ రెడ్డిని జాతీయ కార్యనిర్వహణ కమిటీ లోకి తీసుకుంది.
వీరితో పాటు సునీల్ జక్కర్ ను పంజాబ్ అధ్యక్షుడిగా, బాబులాల్ మరాండిని హరియాణా బీజేపీ ప్రెసిడెంట్ గా అధినాయకత్వం నియమించింది.