Saturday 26th April 2025
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థికి షాక్.. భర్తపై భార్య పోటీ!

వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థికి షాక్.. భర్తపై భార్య పోటీ!

Duvvada srinivas Vs Duvvada vani

Wife Vs Husband in Tekkali | ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం నుండి నామినేషన్ల పర్వం మొదలయ్యింది.

అయితే నామినేషన్ల ఘట్టం తొలి రోజే టెక్కలి నియోజకవర్గంలో వింత పరిస్థితి నెలకొంది. టెక్కలి వైసీపీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ (Duvvada Srinivas)ను ప్రకటించారు సీఎం జగన్ (CM Jagan).

కానీ దువ్వాడ శ్రీనివాస్ పై రెబెల్ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు ఆయన సతీమణి వాణి (Duvvada Vani). గురువారం ఆమె జన్మదినం సందర్భంగా కార్యకర్తలతో మాట్లాడిన ఆమె ఏప్రిల్ 22న స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నట్లు తెలిపారు.

గతంలో టెక్కలి (Tekkali) వైసీపీ ఇంచార్జ్ గా వాణి క్రియాశీలకంగా వ్యవహరించారు. కానీ వైసీపీ అభ్యర్థిగా భర్త శ్రీనివాస్ ప్రకటించిన అనంతరం నుండి ఆమె వైసీపీకి దూరంగా ఉంటున్నారు.

కొంతకాలంగా భార్యా, భర్తల మధ్య విబేధాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో భర్త దువ్వాడ పై భార్య వాణి పోటీకి సిద్ధమయ్యారు.

You may also like
‘కరుంగాలి కంబు’తో పవన్ కళ్యాణ్ ను సత్కరించిన తమిళనాడు నేత
‘లిక్కర్ దొంగల బట్టలు సగమే విప్పారు’
‘పిఠాపురంలో దళితులపై గ్రామ బహిష్కరణ’
‘మీ ఆప్యాయతతో నా మనసు ఉప్పొంగింది’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions