Dog Bites Actor in a Street Play | ఇటీవల దేశవ్యాప్తంగా వీధి కుక్కల దాడులు పెరిగిన విషయం తెలిసిందే. దీంతో వీధి కుక్కల దాడులపై సుప్రీం కోర్టు కూడా జోక్యం చేసుకుంది. ఈ నేపథ్యంలో వీధి కుక్కల దాడులపై అవగాహన కార్యక్రమంలో ఓ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది.
నాటకం ప్రదర్శిస్తున్న సమయంలోనే ఓ కళాకారుడిని కుక్క కరిచింది. కేరళలో రాధాకృష్ణన్ అనే వ్యక్తి తన టీంతో కలిసి వీధి కుక్కలు కరవడానికి వస్తే ఎలా తప్పించుకోవాలి, కరిస్తే ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలని అనే అంశాలపై అవగాహన కల్పించడానికి నాటకం వేశాడు.
నాటకం మధ్యలోనే అక్కడకు వచ్చిన ఓ కుక్క అతడిని కరిచింది. అయినప్పటికీ అతడు ఆగకుండా నాటకాన్ని కొనసాగించాడు. అనంతరం ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.









