Dog Circles Hanuman Idol For 48 Hours | ఉత్తరప్రదేశ్ రాష్ట్రంకో ఓ అద్భుత దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాను కుదిపేస్తోంది. ఓ శునకం గత 48 గంటలుగా హనుమంతుడి చుట్టూ నిరంతరాయంగా ప్రదక్షిణలు చేస్తూనే ఉంది. దింతో ఇది ఆ భగవంతుడి లీల అంటూ భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. యూపీ లోని బీజ్నోర్ జిల్లా నగినా ప్రాంతం నందపూర్ గ్రామంలో స్థానిక ఆలయంలో హనుమంతుడి విగ్రహం చుట్టూ ఓ శునకం మూడు రోజుల క్రితం ప్రదక్షిణలు చేయడం మొదలుపెట్టింది. అప్పటి నుండి నిరంతరాయంగా హనుమంతుడి చుట్టూ తిరుగుతూనే ఉంది.
అలసటగా అనిపిస్తే కాసేపు విశ్రాంతి తీసుకుని మళ్లీ ప్రదక్షిణలు చేస్తుంది. అసలు ఆ శునకం అలా ఎందుకు చేస్తుంది అనేది మాత్రం ఎవరికీ అర్థం కావడం లేదు. అయితే ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు పరిసర ప్రాంతాల నుండి భక్తులు తరలివస్తున్నారు. ఇది ఆంజనేయుడి లీలగా మరికొందరు అభివర్ణిస్తున్నారు.









