FTL and Buffer Zone | హైదరాబాద్ (Hyderabad) లో చెరువులు, కుంటల పరిరక్షణే ధ్యేయంగా అక్రమ కట్టడాలను నేలమట్టం చేస్తూ హైడ్రా దూకుడు ప్రదర్శిస్తుంది. తాజాగా శనివారం ఉదయం నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను కూల్చేశారు హైడ్రా (Hydra) అధికారులు.
ఈ నేపథ్యంలో FTL మరియు బఫర్ జోన్ అనే పదాలు తరచుగా వినిపిస్తున్నాయి. FTL అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్. వర్షాకాలంలో చెరువుల్లో లేదా కుంటల్లో పూర్తిగా నీరు నిండితే ఎంత పరిధి మేరకు నీరు చేరుతుందో దానినే FTL అంటారు.
నీరు లేకున్నా ఆ ప్రాంతం ఎఫ్టీఎల్ పరిధిలోకే వస్తుంది. ఇక్కడ పట్టా భూమి ఉన్నప్పటికీ నిర్మాణాలు చేపట్టరాదు. కేవలం సాగు మాత్రమే చేయాలి. రెండు లేదా అంతకంటే ఎక్కువ నీటి వనరులున్న ప్రాంతాలను వేరు చేసే దాన్నే బఫర్ జోన్ (Buffer Zone) అంటారు.
25 హెక్టార్లు లేదా అంతేకంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న చెరువులు, కుంటలకు బఫర్ జోన్ ఉంటుంది. బఫర్ జోన్ కు 30 మీటర్ల దూరం వరకు ఎలాంటి నిర్మాణం చేయకూడదు. పట్టా భూమి ఉన్నా కేవలం సాగు మాత్రమే చేసుకోవాలి.