DMK MP Controversy | డీఎంకే నేత, ఎంపీ దయానిధి మారన్ (Dayanidhi Maran) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మాట్లాడిన ఒక వీడియో సంచలనంగా మారింది. ఆ వీడియో లో దయానిధి మాట్లాడుతూ..
ఇంగ్లీష్ భాషా వచ్చినవారు ఐటీ ఉద్యోగాలు చేస్తున్నారని, మరోవైపు హిందీ భాష మాత్రమే మాట్లాడే వారు చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నారని తెలిపారు.
అంతేకాకుండా యూపీ, బీహార్ రాష్ట్రాల నుండి తమిళనాడు కు వచ్చి కేవలం హిందీలోనే మాట్లాడే వారు కన్స్ట్రక్షన్ లో కూలీలుగా లేదా బాత్రూమ్ లు కడిగే ఉద్యోగాలు చేస్తున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాగా డీఎంకే ఎంపీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ భగ్గుమంటోంది.
ముఖ్యంగా ఇండియా కూటమి కి చెందిన దక్షిణాది నేతలు దేశాన్ని ప్రాంతం, బాషా పేరిట విభజించాలని చూస్తున్నారని ధ్వజమెత్తుతున్నారు. ఇదిలా ఉండగా గతంలో డీఎంకే మరో ఎంపీ సెంథిల్ కుమార్ ఉత్తరాది రాష్ట్రాలను “గోమూత్ర స్టేట్స్” గా అభివర్ణించిన విషయం తెల్సిందే.