Divyendu Aka Munna Bhaiya Joins Ram Charan’s RC16 | రాం చరణ్ ( Ram Charan ), ఝాన్వీ కపూర్ ( Jhanvi Kapoor ) జంటగా ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు ఓ సినిమాను తెరక్కెక్కిస్తున్న విషయం తెల్సిందే.
వర్కింగ్ టైటిల్ ( Working Title ) గా దీనికి ‘RC16’ అని నామకరణం చేశారు. ఈ మూవీ కోసం బుచ్చిబాబు గత రెండేళ్లుగా పనిచేస్తున్నారు. ఇటీవలే సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యింది.
ఈ క్రమంలో మరో స్టార్ యాక్టర్ ఇందులో భాగమయ్యారు. మీర్జాపూర్ వెబ్ సిరీస్ ( Mirzapur Web Series ) తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ నటుడు దివ్యేoదు.
‘మున్నా భయ్యా’ క్యారెక్టర్ ద్వారా ఆయన ఎంతోమంది అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. తాజగా ఆయన రాం చరణ్, బుచ్చిబాబు సినిమాలో భాగం అయ్యారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ దర్శకుడు బుచ్చిబాబు ఒక పోస్ట్ చేశారు. ‘ మా భయ్యా, మీ భయ్యా, మున్నా భయ్యా. వెల్కమ్ దివ్యేoదు. లెట్స్ రాక్ ( Let’s Rock )’ అని పోస్ట్ చేశారు.
ఆర్సీ 16 లో కన్నడ నటుడు శివ రాజ్ కుమార్, జగపతిబాబు వంటి స్టార్లు నటిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ను అందిస్తున్నారు.