Disha Patani’s sister Khusboo Patani rescues abandoned child | నెలలు నిండిన చిన్నారిని కాపాడి గొప్ప మనసు చాటుకున్నారు నటి దిశా పఠాని సోదరి ఖుష్బూ పఠాని.
గతంలో ఆర్మిలో పనిచేసిన ఖుష్బూ ప్రస్తుతం ఫిట్నెస్ ట్రైనర్ గా వ్యవహరిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లోని బరేలిలో నివాసం ఉంటున్నారు. మార్నింగ్ వాక్ కు వెళ్తున్న సమయంలో తన నివాసం పక్కనే ఉన్న పాడుబడ్డ ఇంట్లో నుండి నెలలు నిండిన చిన్నారి ఏడుపు వినిపించింది.
ఇది ఖుష్బూ గమనించారు. అయితే ఇంట్లోకి వెళ్లేందుకు దారి లేకపోవడంతో గోడ దూకి లోనికి వెళ్లారు. అనంతరం చిన్నారి దుస్తులను శుభ్రం చేసి ఓదార్చారు. అనంతరం చిన్నారిని వెంట తీసుకెళ్లారు. బాటిల్ ద్వారా పాలను చిన్నారికి పట్టించారు.
దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. చిన్నారిని ఎవరైనా గుర్తుపడితే సంప్రదించాలని పేర్కొన్నారు. చిన్నారికి గాయాలు ఉండడంతో స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. అలాగే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వెంటనే దర్యాప్తు చేపట్టిన పోలీసులు చిన్నారి తల్లిదండ్రులను గుర్తించారు. ఈ నేపథ్యంలో ఖుష్బూ స్పందిస్తూ..చిన్నారి పేరు రాధ అని చెప్పారు. చిన్నారిని తల్లితండ్రులకు అప్పగించినట్లు తెలిపారు. ఇదొక కిడ్నాప్ కేసు అని వెల్లడించారు. చిన్నారి క్షేమంగా ఉండాలని కోరుకున్నారు