Director Sukumar Wants To Quit Cinema | ‘పుష్ప-2 ది రూల్’ ( Pushpa-2 The Rule ) తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న దర్శకుడు సుకుమార్ ( Sukumar ) షాకింగ్ కామెంట్స్ చేశారు.
సుకుమార్ చేసిన కామెంట్స్ కి పక్కనే కూర్చున్న గ్లోబల్ స్టార్ రాం చరణ్ ( Ram Charan ) కూడా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. రాం చరణ్, కీయార జంటగా శంకర్ తెరకెక్కించిన మూవీ ‘గేమ్ చేంజర్’ ( Game Changer ) . జనవరి 10న ఈ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది.
ఈ నేపథ్యంలో అమెరికా లోని డల్లాస్ ( Dallas ) లో మూవీ టీం ఒక ఈవెంట్ ను నిర్వహించింది. ఈ ఈవెంట్ లో రాం చరణ్, దర్శకుడు శంకర్, నిర్మాత దిల్ రాజు మరియు అతిథిగా సుకుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘ధోప్’ ( Dhop ) అనే సాంగ్ ను రిలీజ్ చేశారు.
ఇదే సమయంలో మీరు ధోప్ అని ఏదైనా వదిలెయ్యాలి అనుకుంటే ఏది వదిలేస్తారు అంటూ సుకుమార్ ను ప్రశ్నించింది యాంకర్ సుమ ( Anchor Suma ). దింతో ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా సుకుమార్ సినిమా అంటూ జవాబిచ్చారు. దింతో పక్కన కూర్చున్న రాం చరణ్, శంకర్ షాక్ కు గురయ్యారు.
అది జరగదు అంటూ రాం చరణ్ సైగ చేశారు. అలాగే మైకు తీసుకుని గత సంవత్సరం నుండి సుకుమార్ ఇలా చెప్తూ బెదిరిస్తున్నారని చెప్పారు. దింతో రాం చరణ్ చేసిన వ్యాఖ్యలకు సుకుమార్ స్మైల్ ( Smile ) ఇచ్చారు.