Devara Movie News | జూనియర్ ఎన్టీఆర్ ( Jr. NTR ), జాన్వీ కపూర్ ( Jhanvi Kapoor ) జంటగా కొరటాల శివ ( Koratala Siva ) తెరకెక్కించిన మూవీ ‘దేవర’. సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గా ఈ మూవీ రిలీజ్ కానుంది.
ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ ( Trailer )అందర్నీ ఆకట్టుకుంది. కాగా దేవర రిలీజ్ కంటే ముందు రికార్డులు బ్రేక్ చేస్తోంది. ఇందులో భాగంగా ఈ సినిమా మరో అద్భుత ఘనతను సొంతం చేసుకుంది.
కాలిఫోర్నియా లోని లాస్ ఏంజెలస్ లో జరగబోయే అతిపెద్ద జానర్ ఫిల్మ్ ఫెస్టివల్ ( largest genre film festival ) ‘ బియాండ్ ఫెస్ట్ ‘ ( Beyond Fest ) లో దేవరను ప్రదర్శించనున్నారు.
సెప్టెంబర్ 26న సాయంత్రం ఈజిప్టియన్ థియేటర్ లో ఎన్టీఆర్ సినిమాను హాలీవుడ్ అభిమానులు, ప్రముఖులు వీక్షించనున్నారు. ఇందుకోసం ఎన్టీఆర్ సెప్టెంబర్ 25నే అమెరికా వెళ్లనున్నట్లు తెలుస్తోంది.










