Deputy CM Pawan Kalyan Wife Visits Tirumala | డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదం నుండి స్వల్పగాయాలతో భయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న బాలుడి ఆరోగ్యం నిలకడగా ఉందని పవన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో శనివారం రాత్రి పవన్ కుటుంబ సమేతంగా సింగపూర్ నుండి హైదరాబాద్ చేరుకున్నారు. కాగా మార్క్ శంకర్ సురక్షితంగా ప్రమాదం నుండి బయటపడడంతో పవన్ కళ్యాణ్ సతీమణి అనాలెజినోవా తిరుమల చేరుకుని శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించనున్నారు.
ఆదివారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయానికి అనా చేరుకున్నారు. సోమవారం వేకువజామున సుప్రభాత సేవలో భాగంగా శ్రీవారిని దర్శించుకొనున్నారు. అంతకంటే ముందు గాయత్రి సదనంలో టీటీడీ ఉద్యోగుల సమక్షంలో డిక్లరేషన్ పత్రాలపై సంతకం చేశారు.