Deputy Cm Pawan Kalyan On Jal Jeevan Mission | కనీసం రోజుకి సగటు మనిషికి 55 లీటర్ల పరిశుభ్రమైన నీరు అందించాలి అనేది లక్ష్యంగా ఉండాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు.
ఈ మేరకు బుధవారం జల్ జీవన్ మిషన్ వర్క్ షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..వైసీపీ హయాంలో జల్ జీవన్ మిషన్ లో రూ.4 వేల కోట్లు దుర్వినియోగం చేశారని ఆరోపించారు. నీటిని ఎక్కడినుండి తెచ్చుకుంటామనేది గుర్తించక ముందే పైపులు వేశారన్నారు.
‘గత ప్రభుత్వంలో జల్ జీవన్ మిషన్ కింద రూ.4000 కోట్లు ఖర్చుపెట్టాం అంటున్నారు., కానీ ఏ జిల్లాకి వెళ్ళినా నీళ్ళు రావట్లేదు అనే ఫిర్యాదు వస్తుంది. 95.44 లక్షల కుటుంబాలకు గాను 70.04 లక్షల గృహాలకు నీటి కుళాయిలు అందించబడ్డాయి ఇంకా 25.40 లక్షల నీటి కుళాయిలు ఇవ్వాల్సి ఉంది అని జల్ జీవన్ మిషన్ తెలియజేసిందని చెప్పారు. అందుకని అసలు వైసీపీ ప్రభుత్వంలో ఎన్ని ఇళ్లకు నీరు అందించారు, ఏ స్థాయిలో నీరు వస్తున్నాయి అని పల్స్ సర్వ చేయిస్తే – 85.22 లక్షల కుటుంబాలకు గాను కేవలం 55.37 లక్షల గృహాలకే నీటి కుళాయిలు ఆందించబడ్డాయని తేలినట్లు’ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు.